ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

ఇదే లాస్ట్‌ ఛాన్స్‌! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. అయితే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకుంది. 

కానీ విపరీతమైన నెగిటివ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ కావడంతో ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ రోజు నుంచి బుకింగ్స్ పై పడిపోయింది. అయినప్పటికీ పండుగ సెలవులు అలాగే వీకెండ్ కూడా కలిసి రావడంతో ఉన్న పలు థియేటర్స్ లో కూడా డీసెంట్ అక్యుపెన్సీ లనే చూసింది. 

సో ఈ ఆదివారం వరకు గేమ్ ఛేంజర్ కి బాగానే ప్లస్ అయ్యాయి. కానీ ఇపుడు ఈ ఆదివారం రన్ తర్వాత నుంచి అసలు పరీక్ష ఈ చిత్రానికి మొదలు కానుంది అని చెప్పాలి. సో ఈ ఆదివారమే చివరి అవకాశం అని చెప్పుకోవాలి. మరి చూడాలి గేమ్ ఛేంజర్ కి నెక్స్ట్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది.

Related Posts

Comments

spot_img

Recent Stories