వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ పూర్తిపాఠం ఇదే!

Date: 25-10-2014

రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్పుకున్న ప్రతి ఒక్కరికి చిజయమ్మ చేస్తున్న అభ్యర్ధన.

ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాచేస్తుంది. పెద్దలంటారు.. ఇంటిగుట్టు వ్యాధి రట్టు..  తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంట రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం.

నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్ధం కావడం లేదు. నేను అడ్డుకేవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆబద్దాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానే అని దావాలనంతా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్దరికీ కాదు. చెప్పాలంటే ఇది రా ఇది రాష్ట్రానికి కూడా మంచిది  కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా కాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా.. ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఎంతో. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని  ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే స్టేమించారు. మీరు కూడా అంతకు ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు రాజశేఖర్ రెడ్డి గారు. మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటె ఎక్కువగా ప్రేమించి,  ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ, హృదయ పూర్వకంగా నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

మీ అందరికీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి,  పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ టటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటె ఎక్కువ మాట్లాడవద్దు. Blood is thicker than water. వాళ్లు  ఇద్దరు సమాధాన పడతారు. మీరేవరు రెచ్చగొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధానకర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని.నా నమ్మకం.

ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ.. వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్లు  ప్రేమించే YSR గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్సార్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్సార్ గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి కొన్న ఆస్తులు పాప  పేరు మీద..  అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. వైఎస్సార్ గారు బ్రతికి ఉండగనే షర్మిలకు అనులు ఇచ్చేశారు అని లిస్టు  చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆసుల లిస్ట్ చదివి ఉండాల్సింది. వైఎస్సార్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.

విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి షూటిగా నిజం చెప్తున్న.  వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను YSR గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే. అసులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా  ఉండాలన్న వైఎస్సార్ గారి ఆజ్ఞ  నిజం. అస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ  ఆస్తులే  అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్సార్  గారి చివరి రేజల్లో జగన్ ఆయనకు ఇచ్చిన మాట “నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని’ అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది “నాలో నాతో వైఎస్సార్’ అనే పుస్తకంలో ఎప్పుడే రాశా.

రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్నీ కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు.

రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక 2009 నుంచి 2019 వరస 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం. అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్. తీసుకునేవారు. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి.  వీటి అన్నింటికీ అప్పుడూే ఇప్పుడూ నేనే సాక్షిని.

2019 లో సీఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే.. ‘‘పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్టు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు.. కాబట్టి విడిపోదాం’’ అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది.

ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో అసుల్లో ఇవి జగన్ కి ఇది పాప కి అని అనుకున్నారు. 2019 లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితే చెప్పి ఆయన చేతితే రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే పాపకి 200 కోట్ట డివిడెండు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది  కాబట్టే MOU రాసుకున్నారు. అఫీషియల్ గా రాసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యతగా ఇస్తున్నవి.  అటాచ్‌మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇది కూడా ఇవ్వకుండా.. ఆటాచ్‌మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్సార్ గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పొలిటిక్స్ లో జగన్ చెప్పినట్టు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.

జన్మనచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే ఒక బిడ్డ ఇంకో బిడ్డవి అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి. నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబధ్ధాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే.. అయినప్పటికీ వాళ్ళ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను దారే పరిష్కరించుకుంటారు.

రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి, నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.

మరొక్కసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ..

ఇట్లు
ప్రేమతో

వైఎస్ విజయరాజేఖర్ రెడ్డి

Related Posts

Comments

spot_img

Recent Stories