మామూలు బిజినెస్‌ కాదిది!

నాచురల్ స్టార్ నాని ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని, ‘హిట్ 3’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత ఇప్పుడు తన తదుపరి సినిమా ‘ది ప్యారడైజ్’ మీద దృష్టిపెట్టాడు. ఈ సినిమా గురించి మొదటి నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది.

శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి నుంచే భారీ అంచనాలు సెట్ చేసుకుంటోంది. సినిమా ఇంకా సెట్స్ మీదకే వెళ్లలేదు కానీ, ఇప్పటికే మార్కెట్లో బిజినెస్ పరంగా దుమ్ము రేపుతోంది. ఇటీవల బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులు ఒక్కటే దాదాపు 18 కోట్లకి అమ్ముడైయ్యాయని వినిపిస్తోంది.

ఇది మాత్రమే కాదు, ఓటిటి రైట్స్ కూడా కలిపితే మొత్తం బిజినెస్ సుమారు 80 కోట్లకు చేరిందని టాక్. అంటే షూటింగ్ మొదలుకాకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం నాని మార్కెట్ ఎంత దూసుకెళ్తోందో చెబుతుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుద్ పని చేస్తున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ ఈ సినిమాను భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.

ఒకటి కాదు, పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది నిజమైన పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రానుందన్న మాట. మరి ఇప్పటిదాకా ఉన్న హైప్ నిజంగా బాక్సాఫీస్ వద్ద నిలబడతుందా అనేది చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories