చంద్రబాబు సాధించిన విజయం ఇది!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద రాష్ట్ర ప్రజలు అపారమైన విశ్వాసం కనబరచి,  అఖండమైన విజయం కట్టబెట్టినందుకు దక్కే అద్భుతమైన ఫలితం ఏమిటో ఇవాళ తెలిసి వచ్చింది. . కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ కూడా..  నాయకత్వాన్ని బెదిరించే ప్రకటనలు చేయకుండా,  సంయమనం పాటిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్న చంద్రబాబునాయుడు కష్టానికి ఫలితం దక్కింది.  మోడీ మూడోసారి ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత..  తొలి కేంద్ర బడ్జెట్ లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల వర్షం కురిసింది.  చంద్రబాబు నాయుడు కృషి ఫలించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

 అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వెల్లడించారు.  భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు నిధులు కూడా కేటాయిస్తామని నిర్మలమ్మ ప్రకటించడం ఎంతో ఆశావాహ పరిణామం.  గతంలో అమరావతికి నిధులు విడుదల పట్ల కేంద్రం కాస్త సానుకూలంగానే వ్యవహరించింది.  జగన్ సీఎం అయిన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అమరావతిని జగన్మోహన్ రెడ్డి స్మశానంగా మార్చే ప్రయత్నం చేయగా,  కేంద్రం కూడా సైలెంట్ గా ఉండిపోయింది.  ఐదేళ్లలో ఒక్క రూపాయి నిధులు రాలేదు. 

 చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వ్యవహారాలన్నీ ఒక్కసారిగా వేగం పొంజుకున్నాయి.  ఎన్డీఏ సర్కారులు భాగస్వామిగా ఉన్న అవకాశాన్ని కూడా వాడుకుంటూ..  ఆయన రాష్ట్రం నిలదొక్కుకోవడానికి ఉదారంగా సహకరించాల్సిన అవసరాన్ని పదేపదే ఢిల్లీ పెద్దలకు తెలియజేశారు.  ఆ ఫలితంగానే ఈ భారీ సాయాన్ని ప్రకటించడం జరిగింది. 

. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సహాయం అందిస్తామని కూడా కేంద్రమంత్రి చెప్పారు.  గత ఐదేళ్లలో ఎన్నడూ బడ్జెట్ ప్రసంగాలలో పోలవరం పేరు కూడా రాలేదు అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి.  అలాగే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని కూడా నిర్మలమ్మ ప్రకటించారు.  ఒకవైపు బీహార్,   ఒదిశా రాష్ట్రాలు  తమకు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలని పదేపదే అడుగుతుండగా..  తాను కూడా బహిరంగంగా ఒక్క మాట అడగకపోయినప్పటికీ  చంద్రబాబు నాయుడు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీని సాధించుకువచ్చారు.   హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇస్తామని,  విశాఖ చెన్నై  పారిశ్రామిక కారిడార్ కు కూడా సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇవ్వడం విశేషం. రాబోయే ఐదేళ్లలో అమరావతి పోలవరం మాత్రమే కాకుండా సమగ్ర అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories