ప్రజల కష్టాలు వినే ప్రభుత్వం కదా ఇది..!

సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ సక్రమంగా పనిచేస్తే ప్రజలు తమ కష్టాలు మొర పెట్టుకోవటానికి పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళవలసిన అవసరమే రాదు. కారణాలు ఏమైనా కావొచ్చు.. కిందిస్థాయి ప్రభుత్వ యంత్రాంగంలో పని జరగకపోతే ప్రభుత్వంలో పెద్దవాళ్ళకు చెప్పుకుంటే తమ కష్టాలు తీరుతాయి అనే అభిప్రాయం ప్రజల్లో ఉండడం సహజం. అయితే వారు చెబితే.. కష్టాలు వినేదెవరు? ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో, కష్టాలు చెబితే వినే దిక్కులేక అలమటించి పోయిన ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన స్వర్గధామం లాగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన గొప్ప పనుల్లో ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలు వినడానికి ఒక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయడం.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత వారాంతపు రోజుల్లో తప్ప.. ప్రతిరోజూ ఒక మంత్రి మరియు టీడీపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించే ఏర్పాటు చేసారు. ఇలాంటి వ్యవస్థ అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. చాలా వరకు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. అక్కడినుంచే అధికార్లకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇస్తున్నారు. చిన్న ఆర్థిక సాయంతో ముడిపడిన సమస్యలు అయితే మంత్రులు, నేతలు స్వయంగా తామే చేసేస్తున్నారు.

గత ఐదేళ్లలో జగన్ పాలనలో ప్రజలు కష్టాలు చెప్పుకోవాలంటే వినే వ్యవస్థ లేదు. పరదాల మధ్య తిరుగుతూ ప్రజల్ని వెలివేసిన ముఖ్యమంత్రిగా జగన్ పేరుపడ్డారు. చంద్రబాబు పాలనలో ఆ తేడా చూసి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories