మాస్‌ కా దాస్‌ తో ఈ ముద్దుగుమ్మ ఐటెమ్‌ సాంగ్‌… కానీ!

మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్  గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.ఈ సినిమాతో విశ్వక్ మంచి విజయం అందుకోవాలని బాలయ్య విశ్వక్ సేన్ ను ఆశీర్వదించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ టీజర్, ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రంలో మోత మోగిపోద్ది అంటూ సాగే ఓ ఐటెం సాంగ్ ఉంది. విశ్వ‌క్‌సేన్‌, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ న‌టి అయేషా ఖాన్ లు క‌లిసి ఈ సాంగ్ లో మంచి మాస్‌ స్టెప్స్ వేశారు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రేండింగ్ లో ఉంది

అయితే ఈ సాంగ్ కు ముందుగా ఈషా రెబ్బ ను మేకర్స్ సంప్రదించగా ఆమె ఓకే చెప్పింది. సాంగ్ సెట్స్ కూడా వచ్చింది.అయితే ఈ సాంగ్ లో స్టెప్స్ వేస్తుండగా ఆమెకు ఆరోగ్యం పాడయ్యింది.దీంతో ఆమె కోలుకోవడానికి కాస్తటైమ్‌ పట్టింది. సాంగ్ సెట్స్ కూడా వేసి ఉండటంతో ఆ సాంగ్ లో నటించే ఆఫర్ అయేషా ఖాన్ కి దక్కింది. ఈ సాంగ్ కనుక ఈషా చేసి ఉంటే తన కెరీర్ కు ఉపయోగపడేది అని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories