ఈ కాంబో అలరించనుందా!

టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ కాంబినేషన్‌తో వస్తున్న సినిమా ‘కుబేర’. ఈ ప్రాజెక్ట్‌ మొదలైనప్పటి నుంచి మంచి హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి ముఖ్య కారణం శేఖర్ కమ్ముల డైరెక్షన్. ఆయన్ను బాగా ఫాలో అయ్యే ప్రేక్షకులు ఈసారి ఆయన తీస్తున్న సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, అలాగే యూత్ ఫేవరెట్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇలా మూడు వేరే వేరే స్టైల్స్‌కి చెందిన నటులు కలిసి నటించడమే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్లు వచ్చాయి. రీసెంట్‌గా విడుదలైన కౌంట్‌డౌన్ పోస్టర్‌ కూడా ఫ్యాన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇందులో ధనుష్, రష్మికల లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ జోడీ తెరపై చక్కటి కేమిస్ట్రీతో అలరిస్తుందని ఆ పోస్టర్ చూసి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

మరోవైపు శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎప్పుడూ భావోద్వేగాల మిక్స్, రియలిస్టిక్ టచ్ ఉంటుంది. ఇదే తరహాలో ఈసారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమా తీస్తున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌కి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జూన్ 20న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇంత క్రేజీ కాంబినేషన్‌, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ కలసి వచ్చేయడంతో ‘కుబేర’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories