అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమె ‘బహిష్కరణ’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంటుంది. పైగా ఈ సిరీస్ లో అంజలి బోల్డ్ సీన్స్ లో కూడా యాక్ట్ చేసింది. ఈ క్రమంలో అంజలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాజాగా అంజలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడింది. అంజలి ఏం మాట్లాడారు అంటే.. ‘నా కెరీర్ మొదలు నుంచే నాకు మంచి పాత్రలు వచ్చాయి. ఇక నేను ప్రతీ సినిమాకు హోమ్ వర్క్ చేస్తాను. అలాగే, ‘బహిష్కరణ’ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ఈ సీన్స్ విషయంలో కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటిమేట్ సన్నివేశాలు చేసే సమయంలో అందరినీ బయటకు పంపి ఈ సీన్స్ ను షూట్ చేశారు’ అంటూ అంజలి వివరించింది.
అలాగే, అంజలి మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఇప్పటికే, నా గురించి చాలా రూమర్స్ రాశారు. ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతాను. కానీ వెంటనే వాటిని మర్చిపోతాను. ముఖ్యంగా నా పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ పూర్తి అబద్దం’ అంటూ అంజలి చెప్పుకొచ్చింది.