తమిళ స్టార్ హీరోయిన్ నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ నయన్‌కి అభిమానులు ఉన్నారు. ఇక ఉత్తరాదిన కూడా ‘జవాన్’ సినిమాతో నయన తనదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా వార్తల్లో ఉంటుంది.
అయితే, తాజాగా ఆమెను జనం ఏమాత్రం పట్టించుకోకపోవడం నెట్టింట వైరల్ గా మారింది. నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి భోజనం చేసేందుకు ఓ హోటల్‌కి వెళ్లగా.. అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు కామన్ పబ్లిక్‌తో కలిసి క్యూలో నిలబడిందని.. ఆ తరువాతే వారికి ఓ టేబుల్ దొరికిందని విఘ్నేష్ తన ఇన్‌స్టా లో చెప్పాడు. తన పుట్టినరోజున భర్తతో కలిసి నయన ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కోసం వెళ్లింది.
అక్కడ జనం వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా షాకింగ్‌కి గురిచేసింది. అయితే, ఢిల్లీలో ఇలాంటి సీన్స్ కామన్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక తన భార్యతో ఇలా సింపుల్ డిన్నర్ చేసి చాలా రోజులు అయ్యిందని విఘ్నేష్ తన పోస్ట్‌లో చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.