బుద్ధి వక్రం గనుకే మద్దతిస్తానంటే వద్దన్నారు!

సాధారణంగా ఎవ్వరైనా తమ సమస్యల గురించి ఆందోళనలు చేపడుతున్నప్పుడు, ప్రదర్శనలు ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు తమకు మద్దతుగా ఎవరు వచ్చి గళం కలిపినా అందుకు ఆనందంగా ఆహ్వానిస్తారు. తమ సమస్య పట్ల వారికి కూడా సానుభూతి ఉన్నందుకు సంతోషిస్తారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. వక్ఫ్ బిల్లు విషయంలో ముస్లింలు నిర్వహిస్తున్న నిరసన ర్యాలీకి మద్దతు ఇవ్వడానికి వెళితే.. ముస్లింలు ఆమెను ‘దయచేసి వెళ్లిపోవాల్సిందిగా’ కోరారు. శాంతియుతంగా సాగుతున్న తమ నిరసన ర్యాలీని అడ్డుపెట్టుకుని, రాజకీయం చేయవద్దని వారు వేడుకున్నారు. మద్దతిచ్చినట్టే కనిపిస్తూ చంద్రబాబునాయుడు మీద విషం కక్కడానికి ఈ అవకాశాన్ని వాడుకోవచ్చునని అనుకున్నర విడదల రజని వ్యూహం బెడిసి కొట్టింది.

కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల్లో ఈ బిల్లు పట్ల ఇంకా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన అన్ని రాజకీయ పార్టీల మీద కూడా వారికి అంతో ఇంతో అసంతృప్తి ఉంది. బిల్లు చట్టం రూపం దాల్చిన తర్వాత.. దానిపై సుప్రీంలో పిటిషన్ వేసి డ్రామా నడిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ మీద కోపం ఉంది. అలాగే వక్ఫ్ బిల్లుకు చేసిన సవరణల్లో, ముస్లింలకు అన్యాయం జరగకుండా మూడు కీలక సవరణలను ప్రతిపాదించిన తెలుగుదేశం మీద కొంత గౌరవం కూడా ఉంది. అయినా సరే.. ఆ బిల్లు పట్ల ముస్లిం వర్గాలు తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నాయి.

చిలకలూరకిపేటలో కూడా వారు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులను కూడా ఈ ర్యాలీకి ఆహ్వానించలేదు. ర్యాలీకొంతదూరం సాగిన తర్వాత ఆ సంగతి తెలుసుకున్న వాజీ మంత్రి విడదల రజని అప్పటికప్పుడు వచ్చి ర్యాలీలో జాయిన అయ్యారు. వారి వెంట కొంత దూరం నడిచారు. అయితే కొందరు ముస్లిం నాయకులు ఆమె పాల్గొనడం పట్ల అభ్యంతరం చెప్పారు. ఆమె ఆ ర్యాలీలో పాల్గొనడాన్ని కూడా రాజకీయం చేస్తారని వారు భయపడ్డారు. ముస్లిం నాయకుల కోరిక మేరకు పోలీసులు ఆమెకు సమాచారం చెబితే విడదల రజని పోలీసులతో గొడవ పడ్డారు. అన్నిచోట్లా ర్యాలీలు జరుగుతున్నాయి.. చిలకలూరిపేటలో మాత్రమే కాదు కదా.. అంటూ వాదించారు. కానీ ముస్లిం నాయకులంతా అడ్డుకుని.. పార్టీ నేతగా హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తన అనుచరులతో కలసి ర్యాలీనుంచి వెళ్లిపోయిన విడదల రజని.. విలేకర్లతో మాట్లాడి నిష్క్రమించారు.

ఆ సమయంలో కూడా చంద్రబాబునాయుడు తీరుమీదనే ఆమె విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో మహా అయితే మోడీ సర్కారు మీద విమర్శలు చేయాలి. కానీ అందుకు ధైర్యం లేని వైసీపీ నాయకురాలు.. చంద్రబాబు మీదనే విమర్శలు చేయడం విశేషం. ఈ బుద్ధిని గమనించారు గనుకనే.. ముస్లింలు ఆమెను- మాకు మీ మద్దతు వద్దు.. వెళ్లిపోండి అంటూ పంపేసినట్టు ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories