టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ఓ మూవీ. ఈ సినిమా గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో మరోసారి నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వి సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.