ఇన్ని కష్టాలున్నాయి గనుకనే కాకాణి కలుగులో దాక్కున్నారు

కాకాణి గోవర్దనరెడ్డికి వచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన మీద పోలీసు కేసు నమోదు అయిన నాటినుంచి.. పరారీలోకి వెళ్లిపోయి.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ ముప్పుతిప్పలు పెట్టిన కాకాణి గోవర్దన రెడ్డి, తీరా అరెస్టు అయ్యాక ఆయన మీద మరిన్ని కేసులు ముసురుకున్నాయి. ఇప్పట్లో ఆయన అసలు కేసుల ఊబిలోంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదేమో అనిపించేలా.. ఒక దాని తర్వాత మరొకటి.. ఆయన అక్రమాలు అరాచకాలకు సంబంధించిన కేసులు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజా పరిణామాల్లో కాకాణి గోవర్దన రెడ్డికి ఒక కేసులో బెయిలు లభించినప్పటికీ, మరో కేసులో పోలీసులు రిమాండు విధించారు. మరొక కేసులో ఆయనను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఒకేరోజు మూడు కేసుల విషయాల్లో మూడు రకాల పరిణామాలను కాకాణి ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం.

కనుపూరు చెరువులో మట్టి తవ్వకాల విషయంలో అనుమతులకు మించి అక్రమాలు చేసినట్టుగా కాకాణి మీద ఒక కేసు ఉంది. 2023లో చెరువు మెరక తొలగింపు పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి తరలించినట్లుగా ఆరోపణలు రావడంతో.. ఆ కేసులో న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. ఆల్రెడీ రిమాండు ఖైదీగా ఉన్న కాకాణికి.. సర్వేపల్లి రిజర్వాయరులో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సంబంధించి నమోదైన కేసులో మరో కోర్టు బెయిలు మంజూరు చేసింది.

ఒక కేసులో బెయిలు వచ్చినప్పటికీ.. ఆయన రిమాండునుంచి బయటకు వచ్చే అవకాశమే లేకుండాపోయింది. అదే రోజున కొత్త కేసులో మళ్లీ రిమాండు పడింది. కాగా, అనధికార టోల్ గేటు ఏర్పాటుచేసి కోట్లు కొల్లగొట్టిన కేసులో ఆయనను రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించడానిక న్యాయస్థానం అనుమతించింది.
2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసు ఆయన మీద ఉంది. ఈ టోల్ గేటు ను తన అనుచరులతో నిర్వహించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారనేది ఆరోపణ. ఆ కేసులో రెండు రోజుల పోటీసు కస్టడీ అంటే.. అక్రమాల వెనుక ఉన్న రహస్యాలు అనేకం బయటకు వస్తాయని అనుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో తాను సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావనే సంగతి కాకాణి గోవర్దన రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఒక కేసులో అరెస్టు అయినా సరే.. ఒకదాని వెంట మరొకటి కేసులు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉంటాయని.. అంత తొందరగా బయటపడలేనని ఆయనకు ముందే క్లారిటీ ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. కనుకనే.. ఆయన తొలికేసులో అరెస్టు కాకుండా ఉండడానికి సుదీర్ఘకాలం పరారీలో ఉంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారని, తీరా టైం బాగోలేక అరెస్టు అయిన తర్వాత.. అసలు తిప్పలు ఆయనకు ప్రారంభం అయ్యాయని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories