టాలీవుడ్‌లో తమ అభిమాన హీరోను సపోర్ట్ చేసేందుకు అభిమానులు ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఇక తమ హీరోను ఎవరైనా కామెంట్ చేస్తే, అవతల ఏ హీరో ఉన్నా అతడిపై చెలరేగిపోతారు. అయితే, టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య గత కొంతకాలంగా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడారు.
గతంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో నాని, విజయ్ కలిసి ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో యాక్ట్ చేశారు. అయితే, ఆ సమయంలో నాని, విజయ్‌ల మధ్య మంచి స్నేహం ఉందని.. ఒకరికొకరు ఎలాంటి హెల్ప్ అయినా చేసుకునేవారు అంటూ నాగ్ అశ్విన్ తెలిపారు. కానీ, ఎందుకో వారి మధ్య ఫ్యాన్ వార్స్ చోటుచేసుకుంటున్నాయని.. దీనిపై వారికి కూడా సమాచారం ఉండదని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు.
ఇక ఇటీవల ‘ఎవడే సుబ్రమణ్యం’ రీ-యూనియన్‌లో ఈ ఇద్దరు హీరోలు కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ఆయన ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు.