ఈ దాడులు వైసీపీలోని భయానికి చిహ్నాలే!

ఒకటి కాదు రెండు కాదు- రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో విపక్ష కూటమికి చెందిన వారి మీద దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మాచర్లలో తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడి కారును వైసీపీ దుండగులు తగులబెట్టేశారు. ఇవాళ తెనాలిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న  నాదెండ్ల మనోహర్ వెంట ఉన్న అనుచరుల కారుమీద దాడి జరిగింది. ఆయన కారు అద్దాలను దుండగులు పగులగొట్టారు.

విపక్ష కూటమి బలంగా ప్రజల్లోకి వెళుతుండడం.. ప్రజల్లో వారికి మంచి స్పందన లభిస్తుండడం చూసి.. వైసీపీ దళాలు అసహనానికి గురవుతున్నాయి. ఆ విషయం ఆ పార్టీ నాయకుల మాటల్లో మాత్రమే కాదు. చేతల్లో కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పొత్తు బంధాన్ని నీరుగార్చేలా, పొత్తులు వికటిస్తాయని, పొత్తుల వల్ల కూటమి మొత్తం నష్టపోతుందని, పొత్తుల వల్ల నాయకులు అసంతృప్తికి గురై తమ తమ సొంత పార్టీల వెనుకలే గోతులు తవ్వుతున్నారని ఇలాంటి రకరకాల విషపూరిత ప్రచారాలను వైఎస్సార్ కాంగ్రెస్ విచ్చలవిడిగా సాగిస్తూనే ఉంది. అయితే.. ఇలాంటి ప్రచారాలను ముందుగానే ఊహించి మూడు పార్టీలు కూడా తమ తమ కార్యకర్తలను, శ్రేణులను అలర్ట్ చేసి ఉండడంతో వాటి ప్రభావం పెద్దగా పడడం లేదు. పైగా సామాన్య ప్రజలను కూడా ఇలాటి ప్రచారంతో ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. వారు కూడా పట్టించుకోవడం లేదు. దీనితో వైసీపీలో మరింత అసహనం పెరిగిపోతోందని.. దాని ఫలితమే దాడులకు దిగడం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

లేకపోతే, నాదెండ్ల మనోహర్ వెంట ఉన్న జనసేన నాయకుడి కారుపై దాడి జరిగేదే కాదని అంటున్నారు. ఎందుకంటే.. మనోహర్ ఏదో తనంతట తాను వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొల్లిపర మండలం వల్లభాపురం అనే గ్రామానికి వెళ్లి.. అక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు. మీటింగు జరుగుతున్న సమయంలోనే.. ఆయన అనుచరుడు భీమవరపు వేణుగోపాల్ రెడ్డి కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు.
ఇవి శాంపిల్ మాత్రమేనని, వైసీపీలో ఓటమి భయం పెరిగే కొద్దీ, ముందుముందు వారిలో అసహనం మరింతగా పెరుగుతూ.. మరింతగా తెలుగుదేశం, జనసేన, బిజెపి అభ్యర్థులు, వారి అనుచరుల మీద భౌతిక దాడులు పెరుగుతాయని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories