క్షమాపణతో సమసిపోయే పాపాలు కావు ఇవి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరఫున బూతు పోస్టులు పెడుతూ చెలరేగిపోయిన వారిలో ముందుగా అలర్ట్ అయి మేలుకున్నది శ్రీరెడ్డి అని చెప్పాలి. ఎన్డీయే కూటమి సారథ్యంలోని కొత్త ప్రభుత్వం కేసుల నమోదు ప్రారంభించగానే.. గత ప్రభుత్వ కాలంలో తాము చేసిన పాపాలు మెడకు చుట్టుకుంటాయని పసిగట్టి.. జాగ్రత్త పడిన వారిలో ఆమె మొదటివరుసలో ఉంటారు.

జగనన్న కోసం చేశాం.. అంటూ .. మీరు పెద్దవారితో తలపడండి.. చిన్నవారిని వదిలేయండి.. మిమ్మల్ని క్షమించి వదిలేయండి.. లాంటి డైలాగులతో ఆమె ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ముసుగులో వారు చేసిన పాపాలు కేవలం ఒక్క క్షమాపణతో పోయేవి కాదని ఆమెకు బహుశా ఇప్పుడు అర్థమవుతుండవచ్చు.ఎందుకంటే.. ఏపీలో నాలుగైదు చోట్ల శ్రీరెడ్డి గత ప్రభుత్వః హయాంలో పెట్టిన బూతు పోస్టులపై కేసులు నమోదు అయ్యాయి.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత ల మీద, వారి కుటుంబ సభ్యులైన మహిళల మీద అత్యంత అసహ్యకరమైన పోస్టులు పెడుతూ వైఎస్సార్ సోషల్ మీడియా కార్యకర్తలు అయిదేళ్లపాటు ఎలా రెచ్చిపోయారో ప్రజలందరికీ తెలుసు. ఎన్డీయే కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఇలాంటి దుర్మార్గాలను అరికట్టడం మీద దృష్టి సారిస్తోంది.

పైగా జులై ఒకటో తేదీనుంచి కేంద్రప్రభుత్వం అమల్లోకి  తెచ్చిన భారత న్యాయసంహితలో కూడా ఇలాంటి సోషల్ మీడియా తప్పుడు పోస్టుల మీద కఠినమైన చట్టాలకు రూపకల్పన జరగడం, చాలామంది ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారి మీద భారత న్యాయ సంహిత ప్రకారం కేసులు నమోదు అవుతుండడం ఇవన్నీ కూడా గమనించాల్సిన సంగతి. ఈ నేసథ్యంలో ముందుగా జాగ్రత్త పడిన వారిలో శ్రీరెడ్డి ఉన్నారు. కొందరి అరెస్టులు మొదలు కాగానే ఆమె ఏకంగా ఒక వీడియో విడుదల చేశారు. ఇక ఎప్పుడూ ఈ నాయకులమీద, వారి కుటుంబ సభ్యుల మీద తాను పోస్టులు పెట్టనని.. కాబట్టి తనను క్షమించి వదిలేయాలని ఆ వీడియోలో వేడుకున్నారు.

కానీ శ్రీరెడ్డి మీద ఇప్పుడు రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి ఫిర్యాదుతో మల్లిడి శ్రీరెడ్డిపై అక్కడ ఒక కేసు నమోదు అయింది. అలాగే అనంతపురంలో తెదేపా అధికార ప్రతినిధి సంగా తేజస్విని, విశాఖపట్నం కంచరపాలెంలో మరో కేసు కూడా శ్రీరెడ్డి మీద నమోదు అయ్యాయి.

అందరూ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బూతు పోస్టులు పెడుతూ చెలరేగితే.. సదరు మల్లిడి శ్రీరెడ్డి స్వయంగా వీడియోలు చేస్తూ.. వీడియోలలోనే పచ్చిబూతులు మాట్లాడుతూ.. పచ్చి బూతులతో ప్రత్యర్థులను తిడుతూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె పాపాలు కేవలం క్షమాపణలతో తుడిచిపెట్టుకుపోయేవి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories