మంచు కుటుంబంలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. వినయ్ అనే వ్యక్తిపై కూడా మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై విష్ణు పై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు అందించాడు.
ముఖ్యంగా తన అన్న, మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో వివరించాడు.ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి పెద్ద షాక్ తగిలింది.మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈరోజు కొట్టేసింది.