జనం తక్కువే.. కానీ చేసిన గోల మామూల్ది కాదు!

పరామర్శ యాత్రల పేరుతో ఊర్లు తిరిగినప్పుడు వచ్చిన జనసందోహం ఇక్కడ లేదు. హెలిపాడ్ నుంచి పెళ్లి వేదిక వరకు జగన్ ఊరేగింపుగానే వచ్చారు, వెళ్లారు గానీ.. ఆయన కోసం వచ్చిన జనం పోల్చిచూస్తే చాలా చాలా తక్కువ. కానీ.. ఆ విచ్చిన జనం చేసిన అల్లరి, గోల మాత్రం తక్కువ కాదు. తాము ఎంత తక్కువగా ఉన్నా సరే.. పెద్ద రభస చేయగలం అని, మామూలు ప్రజల జీవితాల్ని స్తంభింపజేయగలం అని జగన్ దళాలు భీమవరంలో నిరూపించాయి.

తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం వచ్చారు. హెలికాప్టర్ లో వచ్చిన ఆయన పెళ్లివేదిక వరకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. అయితే పెళ్లికి వచ్చిన వైసీపీ కార్యకర్తలే జగన్ వెంట ఉండి నానా యాగీ చేశారు. బంగారుపాళెం, రెంటపాళ్ల లాంటి యాత్రల విషయంలో ఇరుగు పొరుగు జిల్లాలనుంచి కూడా స్థానిక నాయకులందరినీ ఒత్తిడిచేసి జనాన్ని తోలించుకున్నారు. వారంతా జగన్ మీదికి ఎగబడుతూ రభస చేశారు. జగన్ అడుగు పెడితే చాలు.. జనం వెల్లువలా వస్తారు కదా అని వారు ప్రచారం చేసుకున్నారు. భీమవరంలో అంత సీన్ మాత్రం లేదు. వచ్చిన ఆ కొద్ది మంది జనం కూడా హెలిపాడ్ వద్ద బారికేడ్లు దాటి దూకివెళ్లడం, అక్కడినుంచి పెళ్లిదాకా జగన్ కారు వెంట ర్యాలీ లా రావడం చేశారు. జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం.. ‘సీఎం సీఎం’ అనేనినాదాలూ చేశారు. కల్యాణమండపంలోనూ నానా గందరగోళం సృష్టించారు.

కొందరు రప్పా రప్పా నరుకుతాం అనే ఫ్లెక్సిలను పట్టుకుని ఓవరాక్షన్చ చేస్తే మరికొందరు కాబోయే సీఎం అనే ఫ్లెక్సిలు పట్టుకున్నారు. మీకు ఏసు ఎప్పటికీ తోడుగా ఉంటాడంటూ కొందరు ఫ్లెక్సిలతో దర్శనమివ్వడం విశేషం.
జగన్ వాహనాలు వెళుతుండగా.. కార్యకర్తలు మాత్రం.. ఒకవైపు వర్షం పడుతుండగానే.. బరితెగించి రోడ్ల మీద చొక్కాలు విప్పేసి డాన్యులు చేస్తూ నానా గోల చేశారు. దీంతో మొత్తం ట్రాఫిక్ గంటకు పైగా ఆగిపోయింది. ప్రజలందరూ నానా అవస్థలు పడ్డారు. డ్యాన్సులు చేస్తూ, లారీలపైకి ఎక్కి పార్టీజెండాలు ఊపుతూ విన్యాసాలు చేశారు. పోలీసులు వారిని అదుపుచేసి.. ట్రాఫిక్ ను పునరుద్ధరించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. జగన్ కారులోంచి బయటకు వచ్చి కరచాలనాలకు సిద్ధంగా చేయిచాచుతూ చేసిన ఓవరాక్షన్ ఇక్కడ లేదు గానీ.. కార్యకర్తలు మాత్రం.. నానా యాగీ చేయడం గమనార్హం. జగన్ పెళ్లికి వచ్చినా చావుకు వచ్చినా తమ బుద్ధి మాత్రం ఒకే తీరుగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు నిరూపించుకున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories