న్యాయం అందించడంలో ఆలస్యం జరిగినట్లయితే.. న్యాయమే అందడం లేదనే అర్థం చేసుకోవాలని న్యాయవ్యవస్థ పనితీరుగురించి పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు దాదాపుగా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా తమ్ముడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి పినతండ్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపేస్తే.. ఇప్పటిదాకా నిందితులు ఎవరో తేల్చలేని దుర్బలమైన వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది. ఎవరైతే ఈ కేసులో కీలక నిందితులుగా కేసులో ఉండి అరెస్టు అయ్యారో.. వారిలో చాలా మందికి ఆల్రెడీ బెయిలు వచ్చేసింది. వీరి బెయిళ్లను రద్దు చేయాలని, వీరందరూ ఘనమైన వ్యక్తులు కావడం వల్ల.. బెయిలుపై బయట ఉండి.. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని హత్యకు గురైన వివేకానందరెడ్డి కూతురు సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే.. ఇప్పటిదాకా ఆ కేసులో ఏ సంగతి తేల్చనేలేదు. బెయిళ్లు రద్దు చేస్తారా లేదా తేల్చడంలో జాగు జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో వివేకానందరెడ్డి చంపిన వారిలో ప్రస్తుతం జైలులో ఉన్న మరొక నిందితుడు గంగిరెడ్డికి కూడా తాజాగా మధ్యంతర బెయిలు లభించింది. సుప్రీం కోర్టులో బెయిలు రద్దు పిటిషన్లలో తీర్పు సకాలంలో రాకపోవడం వల్ల మాత్రమే.. గంగిరెడ
వివరాల్లోకి వెళితే.. వివేకానందరెడ్డి హత్య కేసులో గంగిరెడ్డి ఏ1 నిందితుడు. ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి, ఆయన అనుంగు సహచరుడు శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ తదితరులు అనేకమంది ఈ కేసులో నిందితులుగానే ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం బెయిళ్లు వచ్చాయి.
అయితే ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట ఉండడం వలన కేసు దర్యాప్తు మీద తీవ్రమైన ప్రభావం పడుతోందని.. ఆయన బెయిలు రద్దు చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులందరి బెయిళ్లు కూడా రద్దు చేయాలని ఆమె కోరుతున్నారు. ఈ పిటిషన్ పై చాలాకాలంగా వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. మంగళవారం నాడు కూడా వాదనలు విన్న సుప్రీం కోర్టు ఎవరెవరికి, ఎంతమందికి బెయిళ్లు రద్దు చేయాలో చెప్పాలని సీబీఐను ఆదేశిస్తూ కేసును సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. ఈ క్రమంలో అసలు హత్య చేయించినది వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి అంటూ పెట్టిన కేసులను సుప్రీం కోర్టు క్వాష్ చేసేసింది.
వీరి బెయిళ్ల రద్దు పిటిషన్ ఇంకా తేలకపోయేసరికి.. ఈలోగా ప్రస్తుతానికి ఈకేసులో నిందితుడిగా జైల్లో మిగిలిన ఏకైక వ్యక్తి, ఏ1 నిందితుడు గంగిరెడ్డికి బెయిలు లభించింది. ఈ కేసులో చాలా మందికి ఆల్రెడీ బెయిలు వచ్చిందని, గంగిరెడ్డి ఒక్కడే లోపల ఉండడం భావ్యం కాదని ఆయన న్యాయవాది వాదించారు. వీటిని పరిగణించి, ఆయనకు బెయిలు మంజూరైంది. ఒకవేళ.. సుప్రీంలోనే అవినాష్ తదితరుల బెయిళ్లు రద్దయినట్టుగా తీర్పు వచ్చి ఉంటే బహుశా గంగిరెడ్డికి బెయిలు వచ్చేదే కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.