గ్యాప్‌ వచ్చేట్లు ఉంది!

పుష్ప-2’తో వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా విడుదలైన  అన్ని చోట్ల కూడా సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, పుష్ప-2 తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతోంది.

అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ తమ కాంబోలో మరో హ్యాట్రిక్‌ను స్టార్ట్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడంట. దీని కోసం ఆయన చాలా రోజులుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫుల్‌ ఫోకస్ పెట్టాడు.

అయితే, ఈ సినిమాను తొలుత సంక్రాంతి కానుకగా మొదలు పెట్టాలని భావించారట. కానీ, కొన్ని కారణాల వల్ల మార్చి.. అటుపై వేసవికి షిఫ్ట్ అవుతూ వచ్చిందట. ఇక ఇప్పుడు ఏకంగా జూన్‌లోనే ఈ సినిమాను మొదలు పెడుతున్నారనే టాక్‌ వినపడుతుంది. దీంతో అల్లు అర్జున్‌కి తన నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తప్పేలా లేదు అనే వార్త సినీ సర్కిల్స్‌లో షికారు చేస్తుంది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories