కనీసం ఇడ్లీకి కూడా డబ్బులు లేవు!

ధనుష్, నిత్యామీనన్ జంటగా వస్తున్న కొత్త సినిమా ఇడ్లీ కొట్టు. ‘తిరు’ తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను ఇటీవల ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ధనుష్ తన అనుభవాలను పంచుకున్నారు. చిన్నప్పుడు ప్రతిరోజూ ఇడ్లీ తినాలనే కోరిక ఉండేదని, కానీ అప్పట్లో తన దగ్గర అంత సౌకర్యం లేదని చెప్పారు. ఇప్పుడు డబ్బులు ఉన్నా, చిన్ననాటి రోజుల్లో తిన్న ఇడ్లీ రుచి, ఆ ఆనందం మాత్రం ఇప్పుడు రెస్టారెంట్‌లలో దొరకదని ఆయన ఆసక్తికరంగా తెలిపారు.

అలాగే ఈ సినిమా నిజ సంఘటనల ఆధారంగా రూపొందిందని, చాలా మందికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని ధనుష్ అన్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అసలు హేటర్స్ అనే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరని, కొద్దిమంది కలిసి నకిలీ అకౌంట్స్‌తో కావాలనే ప్రతికూల వ్యాఖ్యలు చేస్తారని, కానీ వారంతా కూడా చివరికి సినిమాలు చూసే వారేనని ఆయన వ్యాఖ్యానించారు.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories