ఉచితంగా ఇవ్వడంలో రాజీ లేదు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల దుష్ప్రచారానికి కోరుకుంటున్నాప్పటికీ తాము హామీ కట్టుబడి ఉండటానికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది. తమను ఎన్నికలలో గెలిపిస్తే ఇసుక ఉచితంగా అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు,  మాట ప్రకారం సరికొత్త ఇసుకవిధానం తీసుకువచ్చారు. స్థానిక సంస్థలకు జమ అయ్యే సీనరేజీ ఫీజు, తవ్వకాలు ఖర్చును మాత్రమే కొనుగోలు దారులనుంచి వసూలు చేస్తున్నానమి, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు అనే సంగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా చూడాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరుతున్నారు. 

దుర్మార్గుల కుట్రలు, వ్యూహాలు ఏవైనా అమలవుతున్నాయో ఏమో తెలియదు గానీ.. ఇసుక రీచ్ లకు సంబంధించి స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంటున్న ఇసుక ఆన్ లైన్ కొనుగోళ్లలో వెంటవెంటనే అయిపోతోంది. కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించడం ద్వారా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ఎవరైనా ఇలా చేస్తున్నారేమో అనే అనుమానం కూడా కొందరిలో ఉంది. ఈ అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ.. ఇసుక కొరత ఏర్పడకుండా అన్ని రకాల ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చంద్రబాబు అధికారులతో సమీక్ష కూడా నిర్వహిాంచారు. 

ఇసుక రీచ్ ల సంఖ్య పెంచాలని కూడా చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. నదుల్లో ఇసుక రీచ్ లను గుర్తించి, వాటికి అనుమతులు తెచ్చుకుని తవ్వుతామని ముందుకొచ్చే ప్రెవేటు వ్యక్తులకు సైతం అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. ఇలాంటి ఏర్పాటు వలన.. కొరత అనేది అసలు కనిపించకుండా మేనేజి చేయడం వీలవుతుంది. అదే విధంగా కేవలం ఆన్లైన్ బుకింగుల ద్వారా మాత్రమే కాకుండా.. ఇసుక రీచ్ ల వద్దకు నేరుగా వచ్చే వారికి కూడా ఇసుకను ఆఫ్ లైన్లో కూడా విక్రయించాలని చంద్రబాబునాయుడు అధికార్లకు సూచించారు. డీకేటీ భూములు సహా అందుబాటులో ఉన్న చోట్ల ఇసుకను తవ్వినట్టయితే.. ప్రతిరోజూ 70వేల నుంచి లక్ష టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందని, రాష్ట్రంలో ఎక్కడా కొరత అనే ప్రశ్న తలెత్తే అవకాశం లేదని చంద్రబాబునాయుడు అధికార్లకు సూచించారు. మొత్తానికి ఇసుక అమ్మకాల విషయంలో ప్రజలకు కించిత్ ఇబ్బంది కూడా ఎదురవకుండా చూస్తూ, అలాగని ఉచితంగా ఇచ్చే విషయంలో రాజీలేని ధోరణితో చంద్రసర్కారు ముందుకు సాగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories