తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్‌ను పోస్ట్‌పోన్ చేసినట్లు తెలుస్తుంది. ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై బుధవారం తెలుగు ఫిలిం ఛాంబర్ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయింది. ఈ సమావేశానికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.
ఇక అటుపై సినీ నిర్మాతలతో తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చాలా మంది సమ్మె లేకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో థియేటర్లు రన్ అవుతూనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
దీంతో జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల మూసివేత ఇప్పటికైతే లేనట్టే అని తేలిపోయింది.