పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన “కల్కి 2898 ఎడి” ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఒక వరల్డ్ క్లాస్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ విజయానికి కొనసాగింపుగా మేకర్స్ సీక్వెల్ ని ప్రకటించడంతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. అయితే ఈ రెండో భాగం విషయంలో ఊహించని ట్విస్ట్ బయటకు రావడంతో సినీ వర్గాల్లో చర్చలు ఎక్కువయ్యాయి.
తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం దీపికా పడుకోణ్ ఇకపై పార్ట్ 2 లో కనిపించరని స్పష్టంగా తెలియజేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నదానిపై మాత్రం అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. దీపికా తన రెమ్యునరేషన్ పెంపుతో పాటు కొన్ని ప్రత్యేకమైన షరతులు పెట్టిందని అంటున్నారు. మొదటి భాగం కంటే దాదాపు పావు వంతు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసిందని, అలాగే షూటింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గించిందని టాక్ వినిపిస్తోంది.
ఆమె రోజుకు కేవలం ఐదు గంటలు మాత్రమే షూట్ లో పాల్గొంటానని చెప్పిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మేకర్స్ కు సౌకర్యం కుదరకపోవడంతో ఆమెతో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్టుగా చర్చ సాగుతోంది.