ట్రైలర్‌ కంటే పెద్ద బ్లాస్టే ముందు ఉందిగా!

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్ అవైటెడ్ సినిమా “దేవర” ఫీవర్ కమ్మేసిందని తెలుస్తుంది. గత కొన్ని రోజులు నుంచి దేవర మేనియానే టాలీవుడ్ లో కనిపిస్తుండగా ఇప్పుడు ట్రైలర్ విషయంలో అభిమానులు ఓ రేంజ్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ట్రైలర్ ఇంకా కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌ కోసమే మాట్లాడుతూ బిజీగా ఉన్నారు కానీ అసలు బ్లాస్ట్ సినిమా రిలీజ్ కి ముందు ఇంకొకటి ఉందని చెప్పాలి.

అదే ఈ సినిమా తాలూకా ప్రీరిలీజ్ ఈవెంట్. దాదాపు ఐదేళ్ల తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇది పైగా సంగీత దర్శకుడు అనిరుధ్‌. ఇక ఇలాంటి కాంబోలో ఒక అవుట్ డోర్ ప్రీ రిలీజ్ అంటే ఆ తుఫాన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. అనిరుద్ లైవ్ పెర్ఫామెన్స్ లకి భారీ క్రేజ్ ఉంది. దానికి తోడు ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ కలిస్తే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మేనియా ఎలా ఉంటుందో చూడొచ్చు. మరి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ లెవెల్లో ఉంటుందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories