తెగించి బజారున పడడానికి కారణాలు రెండు!

జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తరువాత కేవలం తన ఆస్తి అయిన ఒక కంపెనీలో షేర్లను, సొంత తల్లికి ఇచ్చిన వాటిని, వెనక్కు తీసుకోవడానికి ఇంతగా ఎందుకు రచ్చకెక్కుతున్నారు అనేది సాధారణంగా ఎవరికైనా కలిగే సందేహం. ఒక కంపెనీలో తల్లికి ఇచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవడం ద్వారా దక్కే లాభం కంటే ఇలాంటి అసహ్యకరమైన రచ్చతో కుటుంబం పరువును బజారులో పెట్టుకోవడం వల్ల జరిగే డ్యామేజీ ఎక్కువ^ అనే స్పృహ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందా అనే అనుమానం కూడా చాలామందికి ఉంది. అయితే ఇంతగా సరస్వతి పవర్ కంపెనీలో^ తల్లికి ఇచ్చిన షేర్లను వెనక్కి తీసుకోవడానికి జగన్ తెగించి కోర్టుకు వెళ్లడం వెళ్ళడానికి.. ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి సరస్వతి పవర్ కి చెందిన భూముల విలువ వందల కోట్ల రూపాయలకు పెరిగిపోవడం.. రెండు ఆ భూములలో దొరికే సున్నపురాయి నిక్షేపాల విలువ పదివేల కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు ఏర్పడడం. ఇంత భారీ మొత్తాలను వదులుకోలేక బజారు బజారుకెక్కడానికే సిద్ధపడ్డారు అనేది సమాచారం.

అయితే సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ అనేది వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జగన్ సాగించిన దోపిడీ పర్వాలలో ఒకటి. రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న రోజుల్లో సరస్వతీ పవర్ పేరుతో రైతుల నుంచి జగన్ ఎకరా మూడు లక్షల వంతెన కారు చౌకగా కొన్నారు. మొత్తం 1515 ఎకరాల వరకు ఉన్న భూమిలో కొంత ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ భూములు విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం వాటి ధర 220 కోట్లకు పైగానే ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. అలాగే ఆ భూములలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలను అప్పట్లో వైఎస్ ప్రభుత్వం సరస్వతీ పవర్ కు అడ్డగోలుగా కట్టబెట్టింది. దాని విలువ ఇప్పుడు పదివేల కోట్లకు పైగా ఉంటుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఎకరా భూమిలో సుమారు 1.70 లక్షల టన్నుల సున్నప్రురాయి లభిస్తుంది అనేది అంచనాౌ
2009 మే నెలలోనే సరస్వతీపవర్ సంస్థకు ఈ సున్నపురాయి నిక్షేపాలను ప్రభుత్వం కట్టబెట్టింది. అప్పట్లోనే స్థలం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అక్కడ కనీసం ఒక ఇటుక పెట్టి పరిశ్రమ పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం సున్నపురాయి లీజులు రద్దుచేస్తే 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ వాటిని పునరుద్ధరించుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. నిజానికి సరస్వతీ పవర్ విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటుచేసిన కంపెనీ అయినప్పటికీ.. దానిని సిమెంట్ కంపెనీగా జగన్ మార్చాలని అనుకున్నారు. తదనగుణంగా సున్నపురాయి గనుల కేటాయింపులకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దయిన లీజు పునరుద్ధరించుకుంటూ ఏకంగా 50 ఏళ్లకు అనుమతులు ఇచ్చుకున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భూమి విలువలు గనుల నిల్వల విలువలు అమాంతం పెరిగిపోయినందున వాటిని వదులుకోవడం ఇష్టం లేక.. ఇచ్చేసిన షేర్ల కోసం మళ్లీ జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు సరస్వతీ పవర్ కు సున్నపురాయి గనుల లీజును రద్దు చేయాలని డిమాండ్లు కూడా ఊపొందుకుంటున్నాయి. అదే జరిగితే బహుశా షేర్లు వెనక్కి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కేసు మీద కూడా పెద్ద ఆసక్తి చూపించకపోవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories