చెవిరెడ్డి ముఠాలో అతితెలివి చాలా ఉన్నదే!

మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా కాజేసిన జగన్ దళం పాపంలో.. ఒక కీలక భాగస్వామి, జగన్ కు అత్యంత ఆత్మీయ నాయకుడైన చెవిరెడ్డి భాస్కర రెడ్డి. వసూళ్ల నెట్వర్క్ కు రాజ్ కెసిరెడ్డి ఒక బాస్ అయితే.. వసూలైన వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ గా మార్చే ప్రయత్నాల్లో నడిపించే వ్యూహాలకు గోవిందప్ప బాలాజీ, ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లు బాస్ లు! ఎన్నికల సమయంలో నిల్వ ఉన్న వందల కోట్ల రూపాయలను అభ్యర్థులకు చేరవేయడానికి.. దొంగ మార్గాలను అన్వేషించడం, డబ్బులు చేరవేయడం అనే బాధ్యత చూసిన కీలక వ్యక్తి చెవిరెడ్డి భాస్కర రెడ్డి. ఆయన వెంకటేశ్ నాయుడు వంటి వారితో పాటు, తన అనుచరుల సాయంతో.. ఈ దందాను చాలా వరకు గుట్టుచప్పుడు కాకుండా నడిపించారు.

చెవిరెడ్డి ముఠాలో వెంకటేశ్ నాయుడు చాలా కీలకమైన వ్య్తక్తి అనే సంగతి ఇప్పుడు రాష్ట్రానికంతా తెలుసు. చెవిరెడ్డి కాదు కదా.. ఏ పార్టీ వారైనా నాయకుల్ని, అధికారుల్ని మానిప్యులేట్ చేయడంలో దందాలు నడిపించడంలో వెంకటేశ్ నాయుడు దిట్ట అని నిరూపించే అనేక వివరాలు ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చాయి. అదే క్రమంలో.. ఆయన వందల కోట్ల రూపాయల నగదు కట్టల పక్కన నిల్చుని వాటిని లెక్కిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నిజం చెప్పాంలే.. వెంకటేశ్ నాయుడు గురించి పూర్తి వివరాలు, ఆయన పూర్తి కార్యకలాపాలు, ఆయన ఫోనులోనో, ఆయన అనుచరుల వద్దనో ఉండగల పూర్తి వీడియోలు బయటకు వస్తే.. అధికార రాజకీయ వర్గాల్లో అనేక మంది పునాదులు కదులుతాయనే భయం కూడా చాలా మందిలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేశ్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత తమ ఆనుపానులు ఎవరికీ దొరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తన భర్త ఫోనులోని వివరాలను పోలీసులు మీడియాకు లీక్ చేస్తున్నారంటూ ఆమె పోలీసుల మీదనే కోర్టులో కేసు వేశారు.

తీరా ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయానికి చెవిరెడ్డి ముఠా అతి తెలివితేటలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా పోలీసులు వెంకటేశ్ నాయుడు ఫోనును ఓపెన్ చేయనేలేదు. ఆయన ఫోనులో ఏమున్నదో ఇప్పటిదాకా వారు గమనించనేలేదు. అది యాపిల్ ఫోను కావడంతో.. వెంకటేశ్ నాయుడు సహకరించకపోవడం వలన.. దానిని తెరవడం సాధ్యం కాలేదు. అయితే ఇతర ఆధారాల ద్వారా దొరికిన సమాచారం కూడా ప్రచారం చేయకుండా.. మీడియా నోరు మూయించే కుట్రతోనే వెంకటేశ్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత ఇలాంటి పిటిషన్ వేసినట్టుగా ఈ వివరాలన్నీ కోర్టుకు తెలిపిన సిట్ తరఫు న్యాయవాది వివరించారు.

నిజానికి దర్యాప్తు జరుగుతున్న కేసులో వెల్లడైన సమాచారాన్ని బయటకు లీక్ చేయడం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమే. కానీ.. రాజ్యాంగంలోని 19వ అధికారణ ప్రకారం సమాచారాన్ని ప్రచురించే ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉంటుంది. ఆ సమాచారం.. దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసినది కానంత వరకు ఆ హక్కుకు భంగం ఉండదు. మొత్తానికి తమ గుట్టుమట్టులు బయటపడకుండి చెవిరెడ్డి ముఠా అతితెలివితేటలతో ఎదురుదాడి వ్యూహం అనుసరిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories