అప్పుడు రక్తపాతం..ఇప్పుడు ప్రేమ పాఠం!

అప్పుడు రక్తపాతం..ఇప్పుడు ప్రేమ పాఠం! న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్-3’ వేసవి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి. 

ఈ సినిమాలో నాని సృష్టించబోతున్న రక్తపాతం ఏ లెవెల్‌లో ఉండనుందో ఇప్పటికే మనకు శాంపిల్ చూపెట్టారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో నాని చెప్పనున్న ప్రేమపాఠం కూడా మనకు చూపించబోతున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘ప్రేమ వెల్లువ’ అనే పాటను మార్చి 24న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories