అప్పుడు కాజల్ అన్న మాటకు షాక్‌ అయ్యా!

టాలీవుడ్  చందమామ కాజల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ప్రేమ, పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ నటిస్తున్న మూవీ “సత్యభామ”.

ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. ఈ మూవీ మే 31 న గ్రాండ్ గా విడుదల కానుంది.తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అలీతో సరదాగా షో కు అతిథిగా వచ్చింది.ఆ షోలో కాజల్ తన మొదటి సినిమా ఆడిషన్ లో దర్శకుడు తేజకి షాక్ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది.

దర్శకుడు తేజ తన ఫోటో చూసి “లక్ష్మీ కళ్యాణం”సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటోలో తనని చూసిన  దర్శకుడు తేజ ఆడిషన్‌కి పిలిచారని కాజల్ తెలిపింది. మొదటి రోజు ఆడిషన్ కి వెళ్లగా ఆడిషన్‌లో తనని ఏడవమని తేజ చెప్పారు. నా లైఫ్‌లో ఎలాంటి టెన్షన్, బాధ లేదు నేను ఎందుకు ఏడవాలి అని కాజల్ అనగా దర్శకుడు తేజ షాక్ అయ్యారంట.

ఆ తర్వాత తన నాన్నతో తిట్టించుకుని మరీ ఏడిచిందట కాజల్‌. ఆ ఎక్స్ ప్రెషన్స్ చూసి తేజ ఫిదా అయ్యి ఆమెని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా కాజల్ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories