గూస్‌ బంప్స్‌ వచ్చేలా థీమ్‌ ఆఫ్ కల్కి 2898 ఏడీ!

కల్కి 2898 ఏడీ విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి థీమ్‌ ఆఫ్‌ కల్కి అనే కొత్త పాటను అభిమానుల కోసం ట్రీట్‌ ఇచ్చారు.

ఈ పాట శ్రీకృష్ణునికి సంబంధించింది. ఈ సినిమాకి ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ పాట సినిమా ఇతివృత్తాన్ని, సారాన్ని సంపూర్ణంగా ప్రేక్షకులకు చేర్చేదిలా కనిపిస్తోంది.  నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ విజువల్‌ వండర్ లో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్స్‌ అందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ భామలు దీపికా పదుకొణె, దిశాపటానీలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఆలనాటి నటి శోభన, యంగ్‌ ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ వంటి స్టార్స్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌ ద్వారా తెలుస్తుంది.

ఈ సినిమా పూర్తి కథని ఈ పాట ద్వారా అర్థం చేసుకోవచ్చని సాంగ్‌ చూస్తే తెలిసిపోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories