జోగి దెబ్బకు వారి పాపాలు పండినట్టే!

నిన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయమైన అనుయాయుల్లో ఒగరుగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ పార్టీని వీడిపోబోతున్నారు. ఆయన తెలుగుదేశం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరుతారనేది అంత ముఖ్యం కాకపోయినప్పటికీ.. ఎన్డీయే కూటమి పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరే అవకాశం ఉంది. అయితే.. జోగి రమేశ్ పార్టీ మారడం అంటూ జరిగితే గనుక.. ఒక రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పాపాలు పండినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. జోగి రమేశ్ ద్వారా జగన్ పరిపాలన కాలంలో జరిగిన అనేక అరాచకాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

జగన్ పరిపాలన కాలంలో ఉండవిల్లిలోని చంద్రబాబునాయుడు ఇంటిమీదకు, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకు వైసీపీ గూండాలు, కార్యకర్తలు ఎగబడి విధ్వంసం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ఇంకా దేవినేని అవినాష్, సజ్జల రామక్రిష్ణారెడ్డి తదితరులు నిందితులు. అలాగే చంద్రబాబు ఇంటిమీద జరిగిన దాడి కేసులో కీలక నిందితుడు జోగి రమేశ్. ఆయన ఇప్పటికే పలుమార్లు పోలీసు విచారణకు హాజరయ్యారు. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు దుర్మార్గంగా కాజేసిన కేసులో కూడా జోగి రమేశ్ కొడుకు, తమ్ముడు నిందితులుగా ఉన్నారు. అయితే చంద్రబాబు ఇంటిమీద జరిగిన దాడికేసు విచారణ ఎదుర్కొంటున్న తననున పార్టీ పట్టించుకోలేదని జోగి రమేశ్ ఆవేదన చెందుతున్నట్టుగా సమాచారం. పార్టీ ఒక కులం వారికి మాత్రమే అండగా నిలుస్తున్నదనే అభిప్రాయానికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ మీద అలిగి జోగిరమేష్ రాజీనామా చేస్తే గనుక.. ఈ దాడి కేసుల్లో అసలు నిందితులు, సూత్రధారుల పేర్లు బయటకు వస్తాయని అంతా భావిస్తున్నారు. మొన్నటిదాకా జోగి రమేశ్ ఎన్నిసార్లు విచారణకు హాజరైనా ఫోను ఇవ్వమని అడిగితే నిరాకరించారు. ఫోను ఇచ్చినట్లయితే.. దాడి జరిగిన రోజు ఎవరెవరు ఏయే వేళల్లో ఫోన్లు చేశారో.. దాడికి ఎవరు ప్రేరేపించారో చాలా సులువుగా తేలిపోతుంది. ఈ భయంతోనే ఆయన అప్పటి ఫోను ఇవ్వడానికి నిరాకరించారు.

ఇప్పుడు జోగిరమేష్ తెలుగుదేశంలో చేరినట్లయితే.. విచారణకు పూర్తిగా సహకరిస్తారని, ఫోను సహా సకల సాక్ష్యాలను కూడా సమర్పిస్తారని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే.. వైఎస్సార్ కాంగ్రెసులోని పెద్దతలకాయల పేర్లు బయటకు వస్తాయని, అసలు సూత్రధారులకు శిక్ష తప్పదని కూడా పలువురు భావిస్తున్నారు. మరి జోగి తుదినిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో వేచిచూడాలి. 

ReplyForwardAdd reaction

Related Posts

Comments

spot_img

Recent Stories