మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర విజయం అనంతరం ఇపుడు వార్ 2 సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ బాలీవుడ్ ఎంట్రీపై అందరిలో మంచి ఆసక్తి కూడా నెలకొంది. ఇక ఇదిలా ఉండగా తారక్ నుంచి రానున్న భారీ సినిమాల్లో సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమా కూడా ఓ మూవీ.
మరి దీనిపై కూడా అనేక అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు బయటకు వచ్చింది. దీంతో ఈ చిత్రంలో ప్రముఖ మళయాళ నటుడు టోవినో థామస్ కూడా కీలక పాత్ర చేయనున్నట్టుగా దాని సమాచారం. మరి టోవినో థామస్ మిన్నల్ మురళి అనే సూపర్ హీరో సినిమాతో అలాగే 2018 అనే సినిమాతో కూడా తెలుగు ఆడియెన్స్ కి బాగా పరిచయమే మరి ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎలాంటి రోల్ లో కనిపించనున్నాడో వేచి చూడాలి.