షార్ట్ ఫిల్మ్ ల ద్వారా టాలీవుడ్ కి పరిచయమై తనదైన కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. నటించిన మొదటి సినిమా ఉయ్యాలా..జంపాలానే సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత కొన్ని సినిమాలు ఒకే అనిపించినా..ఆ తరువాత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ప్రస్తుతం రాజ్ తరుణ్…పురుషోత్తముడు, భలే ఉన్నాడే, తిరగబడరా సామీ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కొంత కాలం క్రితం రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు.
జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనకు పెళ్లి, పిల్లలు వద్దని తెలిపాడు. సింగిల్ గా తాను చాలా హ్యాపీగా ఉంటానని అన్నాడు. పెళ్లి విషయంలో ఇంట్లో ముందు నుంచి కూడా మా నాన్న నీ ఇష్టం అనేవారు.. కానీ మా అమ్మ మాత్రం పెళ్లి చేసుకో అంటూండేది , ఇప్పుడు నీ పెళ్లి నీ ఇష్టం అంటూ వదిలేసిందని చెప్పుకొచ్చాడు. పెళ్లి గురించి ఇప్పట్లో తమ ఇంట్లో ఎలాంటి ఆలోచన చేయట్లేదని వివరించాడు.