వారమంతా వీరమల్లుదే!

జూలై 24న పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల దృష్టి అంతా ఈ సినిమాపైనే నిలిచింది. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొనే పోటీ దాదాపుగా లేదు. ఇప్పటికే ఇతర సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకోవడంతో వీరమల్లు ఏకైక చిత్రంగా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. దీనివల్ల హరిహర వీరమల్లు సినిమా కు థియేటర్ల విషయంలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం దాదాపు 90 శాతం థియేటర్లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపుల్ని చూస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశముంది.

అయితే తొలి రోజు కలెక్షన్లు, మౌత్ టాక్ ఎలా ఉండబోతున్నాయో అన్నదే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారాంతం మొత్తం బాక్సాఫీస్‌ను హరిహర వీరమల్లు దున్నేయడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా, క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరించారు.

ఈ సెటప్ అంతా చూస్తే హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా దూసుకెళ్తుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories