మొత్తానికి పుట్టిన రోజు ట్రీట్‌ రెడీ చేసేశారుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా  ఆగ‌స్ట్ 9న అభిమానుల‌కు చాలా పెద్ద స‌ర్‌ప్రైజ్లు ఉండ‌బోతున్న‌ట్లు కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ ఒకటి. సినిమా లాంఛింగ్‌, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విష‌యాల‌పై మ‌హేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

దీనికి అదనంగా., మరో అప్డేట్‌.. మ‌హేష్ బ‌ర్త్ డే రోజున అత‌డి బ్లాక్‌ బ‌స్ట‌ర్ క్లాసికల్ సినిమా థియేట‌ర్ల‌లో మరోసారి సందడి చేయనుంది. ఏకంగా 23 ఏళ్ల కిందట మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మురారి సినిమా మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మ‌హేష్‌బాబు పుట్టిన రోజు ఈ సినిమా స్పెష‌ల్ షోస్‌ ను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌ సీస్లో కూడా స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు.

మురారి సినిమా రీ రిలీజ్‌ ను కాస్త భారీగానే ప్లాన్ చేస్తోన్న‌ట్లు సమాచారం. దాదాపు 300కు పైగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా రీ రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తుంది. పూర్తిగా యూత్, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన మురారి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా చాలా పెద్ద హిట్‌. ఈ సినిమా ఏకంగా 3 నంది అవార్డుల‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్‌ గా సిల్వ‌ర్ అవార్డుతో పాటు.. బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌ గా ల‌క్ష్మి నంది అవార్డును తీసుకున్నారు.

అలాగే స్పెష‌ల్ జ్యూరీ కేట‌గిరీలో మురారి సినిమాకు మ‌హేష్‌బాబు కూడా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాకి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వహించగా., హీరో మ‌హేష్‌ బాబు సరసన సోనాలీ బింద్రే హీరోయిన్‌ గా న‌టించింది. ఈ సినిమా తోనే సోనాలీ బింద్రే టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories