యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా మిరాయ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తేజ సజ్జా ఒక శక్తివంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌లతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా, ఇప్పుడు మిరాయ్ ద్వారా మళ్లీ అదే స్థాయి హైప్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వరల్డ్‌వైడ్ బిజినెస్ మొత్తం 24.5 కోట్ల వరకు జరిగిందని సమాచారం. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లలో మంచి డిమాండ్ ఏర్పడటంతో బయ్యర్లకు ఇది లాభదాయకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, అమెరికా మార్కెట్‌లోనే సుమారు 4.5 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో 8 కోట్లు, నైజాం ఏరియాలో 7 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, కర్ణాటకలో 2 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం తేజ సజ్జా క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తోంది.