ప్యారడైజ్‌ లోకి ఆ సినిమా విలన్‌!

నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో హిట్ మీద హిట్ అందుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. లేటెస్ట్‌గా “హిట్ 3”తో బ్లాక్‌బస్టర్ సాధించిన నాని, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు. ఈసారి ఆయనకి జతగా ఉన్నది ‘దాస్‌రా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా పెద్ద ఎత్తున రూపొందుతోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పుడు ఊహించని వేగంతో ముందుకు సాగుతున్నాయి.

ఇప్పటికే సినిమా గురించి చాలా వార్తలు వచ్చాయి. వాటిలో ఒకటి అంటే బాలీవుడ్ యంగ్ టాలెంట్ రాఘవ్ జుయల్ ఈ సినిమాలో ఉన్నాడన్నది. ముందుగా ఇది వినిపించినప్పుడు ఊహాగానంగా మిగిలిపోయింది కానీ, తాజాగా మేకర్స్ ఒక స్పెషల్ మేకింగ్ వీడియో ద్వారా ఈ విషయం ఖరారు చేశారు. రాఘవ్ ఓ యూనిక్ లుక్‌లో, ఇప్పటివరకు తెలుగులో చూడని రోల్‌తో ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఆయనను తమ సినిమా ప్రపంచంలోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు.

ఈ స్పెషల్ వీడియోను రాఘవ్ జుయల్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్‌కు ఇది ఒక డబుల్ ట్రీట్ అయింది. వీడియోలో రాఘవ్ పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో కనిపించడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

ఇక ఈ సినిమాలో సంగీతం దర్శకునిగా సెన్సేషన్ అనిరుధ్ పని చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఎస్ ఎల్ వి సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్ని దశల్లోనూ హై స్టాండర్డ్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ, వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అధికారికంగా మొదలైన తర్వాత, ఇందులో నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories