జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు.

ట్రైలర్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కథలోని సస్పెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ మొదలైంది. అసలు రిలీజ్‌కు ముందే ఇంత హైప్ రావడం సుధీర్ బాబుకు కూడా ఒక పాజిటివ్ సైన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల వంటి మంచి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి మేజిక్ చూపుతుందో అన్నదానిపైనే ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories