ట్రైలర్ ముహుర్తం కుదిరింది! టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన మంచి సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం”.
అయితే ఈ సంక్రాంతి కానుకగా విడుదలకి వస్తున్న ఈ మూవీపై ఆల్రెడీ సాలిడ్ బజ్ ఏర్పడగా ఇపుడు ప్రమోషన్స్ లో కూడా మేకర్స్ దూసుకుపోతున్నారు. అయితే ఇపుడు ఈ సినిమా ట్రైలర్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినపడుతుంది. దీని ప్రకారం ఈ జనవరి 6న మేకర్స్ మంచి ఎంటర్టైనింగ్ గా ఉండే ట్రైలర్ కట్ ని వదలబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా తాను ఇచ్చిన అన్ని పాటలు కూడా ఒకటికి మించి ఒకటి సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జనవరి 14న గ్రాండ్ గా విడుదలకి సిద్దంగా ఉంది.