స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా తెలుసు కదా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 17, 2025న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సినిమా ట్రైలర్ను విడుదల చేస్తూ మేకర్స్ ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేపారు.
ట్రైలర్లో రొమాన్స్, యూత్ ఫుల్ వైబ్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకునేలా మిక్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్ లుక్ తో, ఎనర్జీతో కొత్తగా కనిపించాడు. సినిమాలో ఇద్దరు హీరోయిన్ల మధ్య లవ్ ట్రైయాంగిల్ ఎలా సాగుతుందో అన్న కుతూహలం ట్రైలర్ ద్వారా పెరిగింది.
రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించడంతో ఈ సినిమాపై ముందే మంచి బజ్ ఏర్పడింది.