ట్రైలర్ కి ముహుర్తం కుదిరింది! యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘దిల్ రూబా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రీట్‌ను రెడీ చేశారు మేకర్స్. ‘దిల్ రూబా’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 6న రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ చిత్ర ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తుంది.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రుక్సర్ ధిల్లోన్ హీరోయిన్గా నటిస్తుంది. విశ్వ కరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 14న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.