యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా సినిమా “తమ్ముడు” విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. జూలై 4న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాని ద్వారా చిత్రంపై మేకర్స్ నమ్మకాన్ని చూపించారు.
ట్రైలర్ మొత్తంగా చూస్తే ఎమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో మిక్స్ అయి ఓ ఇంటెన్స్ ఫీల్ ఇచ్చింది. అక్క కోసం తమ్ముడు ఎలాంటి పరాక్రమానికి వెళ్తాడో చూపించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. నితిన్ పాత్ర ఆవేశంగా కనిపించడమే కాకుండా, స్టొరంగ్ ఎమోషనల్ డెప్త్ ఉన్నట్టు బాగా ఫీలయ్యేలా చేశారు. కథలో కీలకంగా మారే అక్క పాత్ర నితిన్ జీవితంలో ఎలాంటి మలుపు తేలుస్తుందో ట్రైలర్ స్పష్టంగా చూపించింది.
ఇక విలన్ గా నటించిన సౌరబ్ సచ్దేవా క్రూరతను చూపిస్తూ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ అయినట్టు కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్లో నేపథ్య సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం కానుంది అనిపిస్తోంది. థియేటర్లో ఆ సౌండ్ సినిమాకు మరింత ఉత్కంఠను కలిగించబోతుందని స్పష్టం అయింది.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, కుటుంబ అనుబంధాల చుట్టూ తిరుగుతూ భావోద్వేగాలను ప్రేక్షకుల మదిలో బలంగా మిగిలేలా చేస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.