కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.రెండు రోజుల క్రితం విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ ను కూడా వదిలారు.
అయితే టైటిల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం ‘మెరుపు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇదే ఫిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందెప్పుడో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా మొదలై, ఆగిపోయింది. ఆ సినిమా కోసం ‘మెరుపు’ అనే టైటిల్ పరిశీలించారు.
ఆ తరవాత మళ్లీ ఆ టైటిల్ ఎవరూ ముట్టుకోలేదు. ఇప్పుడు కల్యాణ్ రామ్ ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ పాత్రని మాత్రం ఇప్పటి వరకూ బయటకు విడుదల చేయలేదు. ఆయన పాత్రని పరిచయం చేసేటప్పుడే టైటిల్ కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.