టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా మోస్ట్ అవైటెడ్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కలయికలో విజయ్ కెరీర్లో 12వ సినిమాగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడంతో దీని పై ఓ రేంజ్ లో హైప్ ఉంది. అయితే ఈ మధ్యలో ఈ సినిమా నుంచి అప్డేట్ టైటిల్ టీజర్ కి సంబంధించి రావాల్సి ఉంది కానీ రాలేదు.
అయితే ఫైనల్ గా ఈ క్రేజీ అప్డేట్ పై ఇపుడు ఓ క్లారిటీ బయటకు వచ్చింది.మరి ఈ సినిమా తాలూకా టైటిల్ సహా టీజర్ ను కూడా ఈ ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు తేల్చి చెప్పారు. సో రౌడీ హీరో అభిమానులు ఆ రోజుకి రెడీ అయిపోవాల్సిందే. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.