దేవర ట్రైలర్‌ విడుదలకు ముహుర్తం కుదిరింది!

మాస్‌ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌ లో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా త్వరలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇక సెప్టెంబర్ 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే టీం ప్రకటించింది.

అయితే రేపు సాయంత్రం 05:04 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని మేకర్స్ తాజాగా అప్‌ డేట్ ఇచ్చింది. శక్తివంతమైన ట్రైలర్ విడుదల పోస్టర్‌ ను కూడా మూవీ మేకర్స్‌ తాజాగా అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి  దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఈ సినిమా ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తోందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories