OG ఫస్ట్ బ్లాస్ట్‌కు ముహుర్తం కుదిరింది!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజి నుంచి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. పవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌కి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద హంగామా చేసేలా ఈ సినిమా రూపొందుతున్నట్టే కనిపిస్తోంది.

తాజాగా మేకర్స్ ఓ మ్యూజికల్ అప్డేట్‌ను ప్రకటించారు. ఓజి చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 2న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ వార్తతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పవన్ స్టైలిష్ లుక్ చూపించి అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి సాంగ్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అభిమానులు వేచి చూస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు, అందుకే పాటలపై మంచి అంచనాలున్నాయి. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి కనిపించనున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సెప్టెంబర్ 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories