ముహుర్తం ముదరున్నది..తథాస్తని పందిరిన్నది! అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల జైనబ్ రవడ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా జరిగింది. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి తేదీ కూడా కుదిరినట్లు సమాచారం అందుతుంది. మార్చి 24న అఖిల్, జైనబ్‌ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఈ ముహూర్తానికి రెండు కుటుంబాలు అంగీకరించాయని.. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఈ వివాహ వేడుకకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇక ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడని.. ఈ పెళ్లి వేడుకకు సినీ తారలతో పాటు పలువురు క్రికెట్ స్టార్స్, రాజకీయ నేతలను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అఖిల్ వివాహంతో అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లిసందడి కనపడనుంది.