ముహుర్తం కుదిరింది!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా ‘హిట్’ ఫ్రాంచైజీ థ్రిల్లర్స్‌లో మూడో భాగంగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ‘హిట్-3’ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 22న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. ఓ సాలిడ్ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని చేతిలో గొడ్డలితో క్రిమినల్స్‌ను నరుక్కుంటూ వస్తున్న స్టిల్‌ను చూపెట్టారు. ఈ పోస్టర్‌తోనే ఈ టీజర్‌పై హైప్ క్రియేట్ చేశారు.

ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మరి ఈ మూవీ టీజర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories