ముహుర్తం కుదిరింది!

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా  ‘తండేల్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, బుజ్జి తల్లి సాంగ్‌కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ‘నమో నమ: శివాయ’ అంటూ సాగే ఈ శివశక్తి సాంగ్‌ను గతంలోనే విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సాంగ్ విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఈ సాంగ్‌ను జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేసత్ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories