ప్రస్తుతం రష్మిక మందన్నా క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె నటించిన ప్రతి సినిమా ఒకదానికంటే ఒకటి ఘనవిజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేస్తోంది. తాజాగా ధనుష్‌తో కలిసి నటించిన “కుబేర” సినిమా కూడా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత, ఇప్పుడు రష్మికకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా రష్మిక ఓ సోలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రష్మిక కనపడిన లుక్ మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంది. ఇప్పటివరకు చూసిన పాత్రలకంటే చాలా విభిన్నంగా కనిపిస్తోంది. దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి “మైసా” అనే శక్తివంతమైన టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా కథనంగా చూస్తే, సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా, వైవిధ్యభరితమైన ప్రెజెంటేషన్ ఉండేలా తయారవుతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారంటేనే, దీని మీద వారు పెట్టుకున్న నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది. ‘అన్ ఫార్ములా ఫిల్మ్స్’ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
ఈ కథనాలన్నింటితో చూస్తే, రష్మిక తన కెరీర్‌లో మరో స్పెషల్ మైలురాయిని టచ్ చేయబోతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.