మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, సుస్మిత అనాలా, సాంచిరాయ్ , మనిషా జష్నాని, హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ , వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ “లోపలికి రా చెప్తా” సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రం నుండి మొదటి సాంగ్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్‌తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ విడుదల చేయించారు. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మా చిత్రంలో మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయించాలని నిర్ణయించాం. అలాగే సంగీత దర్శకులు డేవ్ జాండ్ (ఈగల్ ఫేమ్) సారథ్యంలో కపిల్ కపిలన్ ఈ పాట ఆలపించారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.’ అని వివరించారు.